నడిరోడ్డుపై పోలీసులు, మహిళ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్!
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ పోలీసులు, ఓ మహిళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. లాల్‌ఘటి కూడలీలో ట్రాఫిక్ పోలీసులు యథావిథిగా తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో బైరాగఢ్ వైపు నుంచి ఓ కారు వచ్చింది. ఆ కారులో నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులు ఆ కారును పక్కకు తీసుకెళ్లారు. ఇంతలో కారులో ముందు సీట్లో కూర్చున్న మహిళ కారు లోంచి దిగింది. అనంతరం ఆమె తనిఖీ చేస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ పోలీసులు, ఓ మహిళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. లాల్‌ఘటి కూడలీలో ట్రాఫిక్ పోలీసులు యథావిథిగా తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో బైరాగఢ్ వైపు నుంచి ఓ కారు వచ్చింది. ఆ కారులో నలుగురు వ్యక్తులు కనిపించారు. పోలీసులు ఆ కారును పక్కకు తీసుకెళ్లారు. ఇంతలో కారులో ముందు సీట్లో కూర్చున్న మహిళ కారు లోంచి దిగింది. అనంతరం ఆమె తనిఖీ చేస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మహిళ కారు ఎక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. తనిఖీల్లో పోలీసులు వివక్ష చూపిస్తున్నారని, తమ కారును ఆపిన పోలీసులు బీజేపీ జెండాతో వెళ్తున్న కారును మాత్రం ఆపలేదంటూ సదరు మహిళ ఆరోపించింది. దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ.. మహిళ గొడవ కారణంగా బీజేపీ జెండా ఉన్న కారును ఆపలేకపోయామని చెప్పారు. అయితే, ఆ మహిళపై ఎలాంటి జరిమానా విధించలేదని తెలిపారు.