అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ గేట్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో సీపీఎం […]

Update: 2020-11-02 03:55 GMT

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ గేట్ వద్ద సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో సీపీఎం నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు మంత్రి బొత్స తమకు అనుకూల మీడియాకి మాత్రమే అనుమతించి ఇతర మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించడంతో.. మీడియా ప్రతినిధులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News