తిరుమలలో ఉద్రిక్తత
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనాల్లో లోకల్, నాన్‌లోకల్ మధ్య వాగ్వాదం నెలకొంది. వైకుంఠ ఏకాదశికి తిరుమలలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో టోకెన్ల కోసం స్థానికేతరులు అలిపిరి గేటు వద్ద ధర్నా నిర్వహించారు. తమను కొండపైకి అనుమతి ఇవ్వాలని భక్తులు ఆందోళన చేపట్టారు. టీటీడీ అధికారుల మధ్య సమాచార లోపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భక్తుల ఆందోళనతో అలిపిరి గేటు […]
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి దర్శనాల్లో లోకల్, నాన్‌లోకల్ మధ్య వాగ్వాదం నెలకొంది. వైకుంఠ ఏకాదశికి తిరుమలలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో టోకెన్ల కోసం స్థానికేతరులు అలిపిరి గేటు వద్ద ధర్నా నిర్వహించారు. తమను కొండపైకి అనుమతి ఇవ్వాలని భక్తులు ఆందోళన చేపట్టారు. టీటీడీ అధికారుల మధ్య సమాచార లోపంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, భక్తుల ఆందోళనతో అలిపిరి గేటు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.