వేరుశనగ@రూ. 8019

దిశ,వెబ్‌డెస్క్: కర్నూలులో వేరుశనగ రైతులకు పంట పండింది. వేరుశనగ ధర ఆదివారం ఏకంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 8019 పలికింది. రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మిగనూరు యార్డులో వేరుశనగకు ధర లభించడం విశేషం. జిల్లాలోని గోనెగండ్ల గ్రామ రైతు గోపాల్ తన పంటను అత్యధిక ధరకు విక్రయించాడు. ఉదయ్ కిరణ్ సీడ్స్ కంపెనీకి చెందిన ప్రతినిధి రమణారెడ్డి రూ. 8019 చొప్పున వేరుశనగను […]

Update: 2021-01-25 07:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: కర్నూలులో వేరుశనగ రైతులకు పంట పండింది. వేరుశనగ ధర ఆదివారం ఏకంగా రికార్డు స్థాయికి చేరుకుంది. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం క్వింటాల్‌కు అత్యధికంగా రూ. 8019 పలికింది. రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మిగనూరు యార్డులో వేరుశనగకు ధర లభించడం విశేషం. జిల్లాలోని గోనెగండ్ల గ్రామ రైతు గోపాల్ తన పంటను అత్యధిక ధరకు విక్రయించాడు. ఉదయ్ కిరణ్ సీడ్స్ కంపెనీకి చెందిన ప్రతినిధి రమణారెడ్డి రూ. 8019 చొప్పున వేరుశనగను కొనుగోలు చేశారు. కాగా ఇదే మండలం మల్కాపురానికి చెందిన ఈరప్ప అనే రైతుకు చెందిన పంటను గణేష్ ట్రేడర్స్ వారు క్వింటాల్‌కు రూ. 8010 చొప్పున కొన్నారు.

Tags:    

Similar News