ఏపీ గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టే విధించింది. గవర్నర్ గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని స్పష్టం చేసింది. గతనెల 31న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ బిల్లులకు ఆమోదం తెలపగా.. ఇవాళ రాజధానికి ప్రాంతానికి సంబంధించిన రైతులు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగస్టు 14వరకు స్టే విధించింది. తదపురి విచారణను వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.

Update: 2020-08-04 05:15 GMT

Tags:    

Similar News