తెలంగాణ సర్కారుపై కోర్టు ధిక్కార నేరం

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో ఎక్కువ టెస్టులు చేయడంలో విఫలమైన తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా కట్టడిపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వేలాది మందితో ర్యాలీలు, రోడ్‌షోలు జరుగుతున్నా.. కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడం లేదని చివాట్లు పెట్టింది. రోజుకు కనీసంగా యాభై వేల టెస్టులు […]

Update: 2020-11-26 04:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో ఎక్కువ టెస్టులు చేయడంలో విఫలమైన తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కరోనా కట్టడిపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వేలాది మందితో ర్యాలీలు, రోడ్‌షోలు జరుగుతున్నా.. కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడం లేదని చివాట్లు పెట్టింది. రోజుకు కనీసంగా యాభై వేల టెస్టులు చేయాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు ధిక్కారానికి పాల్పడిందని వ్యాఖ్యానించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అనేక రాష్ట్రాల్లో ఎక్కువ టెస్టులు చేస్తూ కరోనా పాజిటివ్ వ్యక్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం రోజుకు 40 వేల చొప్పున చేస్తున్న టెస్టులు సరిపోవని స్పష్టం చేసింది. దీనిని తక్షణం యాభై వేలకు పెంచి క్రమంగా లక్ష వరకూ తీసుకెళ్ళాలని ఆదేశించింది. ఈ నెల 20న జరిగిన విచారణ తర్వాత కూడా టెస్టులు చేయడంలో పురోగతి కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ భయాలు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రం ఆ తరహా ముందు జాగ్రత్త చర్యలు లేవని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News