నిబంధనల ఉల్లంఘనలపై హైకోర్టు సీరియస్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొవిడ్-19 మాస్ టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావుకు సమ్మన్లు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించడంలో ఆలస్యం చేయడం పట్ల సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ జాప్యం ఐసీఎంఆర్ నిబంధనలను ఉల్లంఘించడంగా పేర్కొంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం నెగిటివ్ వచ్చినప్పటికీ వారిని ఆర్టీ-పీసీఆర్ టెస్టు కోసం ఐసోలేషన్‌లో ఉంచాలి. ఐతే మళ్లీ టెస్టులు చేయకుండానే వదిలేస్తున్నారని […]

Update: 2020-07-14 11:45 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొవిడ్-19 మాస్ టెస్టులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టు మంగళవారం అభిప్రాయపడింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావుకు సమ్మన్లు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించడంలో ఆలస్యం చేయడం పట్ల సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ జాప్యం ఐసీఎంఆర్ నిబంధనలను ఉల్లంఘించడంగా పేర్కొంది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం నెగిటివ్ వచ్చినప్పటికీ వారిని ఆర్టీ-పీసీఆర్ టెస్టు కోసం ఐసోలేషన్‌లో ఉంచాలి. ఐతే మళ్లీ టెస్టులు చేయకుండానే వదిలేస్తున్నారని పేర్కొంది.

Tags:    

Similar News