దాసోజు శ్రవణ్‌పై హైకోర్టు ఆగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని, రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా.. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే సమయంలోనే ఈ విషయం గుర్తొచ్చిందా అని హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించింది. ఎన్నికలు ఆపే […]

Update: 2020-11-16 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్టే ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని, రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా.. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే సమయంలోనే ఈ విషయం గుర్తొచ్చిందా అని హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించింది. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతోనే పిల్ దాఖలు చేశారని.. పిల్‌పై విచారణ జరుపుతాం కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఈసీ, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News