శ్రీచైతన్య, నారాయణ కళాశాలల గుర్తింపు రద్దు

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఆ కళాశాల యజమాన్యానికి బోర్డు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చింది. వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు గుర్తింపును కోల్పోయిన 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి […]

Update: 2020-04-17 11:32 GMT

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు షాకిచ్చింది. నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఆ కళాశాల యజమాన్యానికి బోర్డు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చింది. వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. ఇంటర్ బోర్డు గుర్తింపును కోల్పోయిన 68 కాలేజీలలో శ్రీచైతన్యకు సంబంధించినవి 18 ఉండగా నారాయణ గ్రూపుకు చెందినవి 26 ఉన్నాయి. ఆ కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు గత నెల 24వ తేదీనే ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. పోస్టు ద్వారా కూడా ఉత్తర్వులను పంపింది. రానున్న విద్యా సంవత్సరానికి ఈ 68 కళాశాలల గుర్తింపు రద్దయినట్లే. అయితే అందులో ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి రాష్ట్ర ఇంటర్ బోర్డు త్వరలో స్పష్ట ఇవ్వనుంది.

నగరంలో ఉన్న నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, అందులో చదువుతున్న విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర హైకోర్టులో సామాజిక కార్యకర్త రాజేశ్ ఇటీవల ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ లేదని, అయినా దీర్ఘకాలంగా నడుస్తున్నాయని, ప్రభుత్వం కూడా సీరియస్ దృష్టి పెట్టలేదని, చివరకు విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం అని కోర్టుకు ఆ పిటిషన్‌లో వివరించారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటికి సంబంధించిన వివరాలపైనా, పిటిషనర్ ప్రస్తావించిన కళాశాలల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డును ధర్మాసనం ఫిబ్రవరిలో ఆదేశించింది. అయితే మార్చి 4వ తేదీ నుంచి నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్ధులపై ప్రభావం పడుతుందని, అందుకే పరీక్షలు ముగిసిన తర్వాత గుర్తింపు లేని, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ధర్మసనానికి ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. కళాశాలల యాజమాన్యం తరపున కూడా వాదనలు విన్న హైకోర్టు ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్‌ 3న తుది నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది.

దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ఇంటర్ బోర్డు ఆ కళాశాలల యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో నిర్దిష్ట గడువులోగా వివరణ ఇవ్వాలని వాటికి మెయిల్ ద్వారా నోటీసు జారీ చేయడంతోపాటు పబ్లిక్ నోటీసు కూడా జారీ చేసింది. ఆ ప్రకారంగా కళాశాలల యాజమాన్యం కూడా వివరణను లిఖితపూర్వకంగా పంపాయి. అయితే ఆ సమాధానాలతో ఇంటర్ బోర్డు సంతృప్తి చెందలేదు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి వచ్చిన వివరణను కూడా ఇంటర్ బోర్డు అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా ఆ 68 కళాశాలల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో అధికారపూర్వకంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Tags: Telangana, SriChaitanya, Narayana, Colleges, High Court, Recognition, Cancellation, Fire Safety

Tags:    

Similar News