ఇది కోర్టు ధిక్కారమే.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్సీపీని సూచించే విధంగా రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్ గతంలో విచారించిన హైకోర్టు రంగులను తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్న మూడు రంగులకు మరో రంగులను జోడించిన ప్రభుత్వం ఆ రంగులను అలాగే ఉంచింది. దీనిపై న్యాయవాది సోమయాజులు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం తీర్పును […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్సీపీని సూచించే విధంగా రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్ గతంలో విచారించిన హైకోర్టు రంగులను తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్న మూడు రంగులకు మరో రంగులను జోడించిన ప్రభుత్వం ఆ రంగులను అలాగే ఉంచింది. దీనిపై న్యాయవాది సోమయాజులు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, ఆ రంగు ప్రభుత్వానికి ప్రతీక కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నేడు తీర్పు వెలువరిస్తూ, పంచాయతీ కార్యాలయాలకు రంగులు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సీఎస్, సీఈసీ పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి ఈ రంగులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మూడు రంగులు తొలగించాలన్న కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా కొత్త రంగు వేయడాన్ని కోర్టు ధిక్కారం కింద సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని తెలిపింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది.