ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు.. 4 వారాలే డెడ్ లైన్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో అలసత్వం వహించొద్దంటూ సూచించింది. నాలుగు వారాల్లో బిల్లులు మొత్తం చెల్లించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. అలాగే బకాయిలను 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే కొంత చెల్లిస్తే మిగిలినది […]

Update: 2021-10-05 05:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో అలసత్వం వహించొద్దంటూ సూచించింది. నాలుగు వారాల్లో బిల్లులు మొత్తం చెల్లించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. అలాగే బకాయిలను 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే కొంత చెల్లిస్తే మిగిలినది కూడా 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపోతే ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు కోరుతూ దాదాపు 2వేల మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిలో 1,013 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు మంగళవారం తుది తీర్పును వెల్లడించింది.

Tags:    

Similar News