కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై.. హైకోర్టు కీలక ఆదేశాలు..

దిశ, ఏపీ బ్యూరో: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని కోరుతూ.. కుప్పం టీడీపీ అభ్యర్థులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావులు వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఆఫిసర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని […]

Update: 2021-11-16 04:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని కోరుతూ.. కుప్పం టీడీపీ అభ్యర్థులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు స్వీకరించింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావులు వాదనలు వినిపించారు.

ఇరు వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఆఫిసర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఓట్ల లెక్కింపును రికార్డింగ్ చేయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. కౌటింగ్ వీడియో రికార్డింగ్‍ను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Tags:    

Similar News