‘RGV ఏందిది.. సమాధానం చెప్పు’
దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ సినిమా పై వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమాను నిలిపివేయాలని దిశ తండ్రి, ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల తల్లిదండ్రులు రాంగోపాల్ వర్మ ఇంటివద్ద పలుమార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో దిశ తండ్రి సినిమాను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే RGVకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు సినిమా పై నిర్ణయం తీసుకోక […]
దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీవీ దిశ ఎన్‌కౌంటర్ సినిమా పై వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమాను నిలిపివేయాలని దిశ తండ్రి, ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల తల్లిదండ్రులు రాంగోపాల్ వర్మ ఇంటివద్ద పలుమార్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో దిశ తండ్రి సినిమాను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారం పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే RGVకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
సెన్సార్ బోర్డు సినిమా పై నిర్ణయం తీసుకోక ముందే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని సీజే ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీంతో ట్రైలర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారని పిటిషనర్ తరఫు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చింది. దీనికి తోడు అనుమతులు ఇచ్చారో లేదో అన్న వ్యవహారం పై ఆరా తీయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కౌంటర్లు దాఖలు చేయాలని సెన్సార్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.