మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీ కేసు సోమవారం విచారణ జరిగింది. కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో తాను విచారణ కొనసాగించాలా? వద్దా? అనేది సీజే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కెరీర్ ముగింపు దశలో ఇలాంటి పిటిషన్ చూస్తానని అనుకోలేదని.. రాగద్వేషాలు లేకుండా వ్యవస్థ కోసం పని చేస్తున్నానని రాకేష్ కుమార్ చెప్పారు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 28కి […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీ కేసు సోమవారం విచారణ జరిగింది. కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ కేసులో తాను విచారణ కొనసాగించాలా? వద్దా? అనేది సీజే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కెరీర్ ముగింపు దశలో ఇలాంటి పిటిషన్ చూస్తానని అనుకోలేదని.. రాగద్వేషాలు లేకుండా వ్యవస్థ కోసం పని చేస్తున్నానని రాకేష్ కుమార్ చెప్పారు. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
మిషిన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల విక్రయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.