మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను మధ్యాహ్నాం 2.15 కు వాయిదా వేసింది మార్చి10న పురపాలిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు ఉపసంహరణకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను మధ్యాహ్నాం 2.15 కు వాయిదా వేసింది
మార్చి10న పురపాలిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు ఉపసంహరణకు తుదిగడువు. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి.