టీడీపీలో జోష్.. కీలక నేతకు బెయిల్ మంజూరు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరికి హైకోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసులు తనను కొట్టారని బ్రహ్మం చౌదరి చెప్పినా మెజిస్ట్రేట్ ఎందుకు వైద్యపరీక్షలకు పంపించలేదని కింది కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై ఈనెల 28లోపు వివరణ ఇవ్వాలని జిల్లా కోర్టును ఆదేశించింది. నాదెండ్ల బ్రహ్మం చౌదరిని అరెస్ట్ చేసే ముందు 41(ఏ) నోటీసులు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. బ్రహ్మం చౌదరి తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో తిరగకుండా […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరికి హైకోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. పోలీసులు తనను కొట్టారని బ్రహ్మం చౌదరి చెప్పినా మెజిస్ట్రేట్ ఎందుకు వైద్యపరీక్షలకు పంపించలేదని కింది కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై ఈనెల 28లోపు వివరణ ఇవ్వాలని జిల్లా కోర్టును ఆదేశించింది. నాదెండ్ల బ్రహ్మం చౌదరిని అరెస్ట్ చేసే ముందు 41(ఏ) నోటీసులు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. బ్రహ్మం చౌదరి తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో తిరగకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో 3 వారాలపాటు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ప్రవేశించొద్దని బ్రహ్మం చౌదరికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో సీఐపై బ్రహ్మంచౌదరి దాడి చేసినట్లు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.