ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దుపై స్టే
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో శుక్రవారం విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని పిటిషన్‌లో ఆరోపించాయి. దీంతో ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మే […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో శుక్రవారం విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించారని పిటిషన్‌లో ఆరోపించాయి. దీంతో ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మే 21న తీర్పును వెలువరించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే విషయమై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్‌ఈసీ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ తమ పిటిషన్‌లో పేర్కొంది.