ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో భాగంగా పలు వ్యాఖ్యలను చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. రాజ్యాంగ పరంగా పరిపాలన జరుగుతోందా లేదా అనే అంశంపై విచారించి న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మూడు రాజధానుల బిల్లులను మండలి వ్యతి రేకిస్తే.. మండలి రద్దుకు సిఫార్సు చేసిన విధానం తమ […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో భాగంగా పలు వ్యాఖ్యలను చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. రాజ్యాంగ పరంగా పరిపాలన జరుగుతోందా లేదా అనే అంశంపై విచారించి న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మూడు రాజధానుల బిల్లులను మండలి వ్యతి రేకిస్తే.. మండలి రద్దుకు సిఫార్సు చేసిన విధానం తమ దృష్టిలో ఉందని ధర్మాసనం తెలిపింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగులపై రిజిస్టార్ జనరల్ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోవడాన్ని గమనించామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.