ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

దిశ,వెబ్‌డెస్క్: ఏపీప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు హైకోర్టు జారీ చేసింది. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు వ్యవ‌హారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క‌న‌బ‌ర్చుతోన్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్ధు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్రభుత్వాన్ని హైకోర్టు నిల‌దీసింది. నిన్న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వైద్య నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించిన‌ప్పటికీ సాయంత్రం 6 గంట‌ల […]

Update: 2021-05-19 02:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు హైకోర్టు జారీ చేసింది. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు వ్యవ‌హారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క‌న‌బ‌ర్చుతోన్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్ధు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల‌ను ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్రభుత్వాన్ని హైకోర్టు నిల‌దీసింది. నిన్న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వైద్య నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించిన‌ప్పటికీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రాత్రి 11 గంట‌ల‌కు ఆర్డర్ కాపీ ఇచ్చిన‌ప్పటికీ ఎందుకు చ‌ర్యలు తీసుకోలేద‌ని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రఘురామకృష్ణరాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలదని హైకోర్టు ప్రభుత్వం పై మండిపడింది. ఆదేశాలు 11 గంటలకు అందడం వల్లే అమలు చేయలేకపోయామని ఏఏజీ వివరణ ఇచ్చింది. వెంటనే తమ దృష్టికి ఎందుకు తీసుకరాలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏఏజీ వ్యాఖ్యాల్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కర‌ణ కింద నోటీసులు ఇవ్వాల‌ని జ్యుడీషియ‌ల్ రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అద‌న‌పు డీజీ, ఎస్‌హెచ్‌వోకు కూడా నోటీసులు ఇవ్వాల‌ని హైకోర్టు చెప్పింది. ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రిగితే కోర్టులు స్పందిస్తాయ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Tags:    

Similar News