నివురుగప్పిన నిప్పులా మంథని
దిశ, వెబ్‌డెస్క్ : అడ్వోకేట్ వామన్ రావు దంపతుల హత్య జరిగి నాలుగో రోజు గడుస్తున్నా.. మంథని ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిత్యం తమ కళ్ల ముందే తిరిగే వ్యక్తులే హత్యలకు పాల్పడ్డారని తెలియడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వామన్ రావు, కుంట శ్రీనివాస్ ల గ్రామమైన గుంజపడుగలో నివురుగప్పిన నిప్పులా ఉన్నది. బుధవారం నాటి ఘటన నేటికీ వారి కళ్ల ముందే కదిలాడుతోంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : అడ్వోకేట్ వామన్ రావు దంపతుల హత్య జరిగి నాలుగో రోజు గడుస్తున్నా.. మంథని ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిత్యం తమ కళ్ల ముందే తిరిగే వ్యక్తులే హత్యలకు పాల్పడ్డారని తెలియడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వామన్ రావు, కుంట శ్రీనివాస్ ల గ్రామమైన గుంజపడుగలో నివురుగప్పిన నిప్పులా ఉన్నది. బుధవారం నాటి ఘటన నేటికీ వారి కళ్ల ముందే కదిలాడుతోంది.
కాగా వామన్ రావు హత్యకు కత్తులు, వాహనం సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును నేడు పోలీసులు కోర్టులో రిమాండ్ చేయనున్నారు. బిట్టు శ్రీనును శుక్రవారం తెల్లవారు జామున అరెస్ట్ చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం రాత్రి సమయంలో హత్యా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తోంది. వామన్ రావు హత్యలో ప్రత్యేక్షంగా బిట్టు శ్రీను పాల్గొనకపోయినా మర్డర్ ప్లాన్ ఆయనే చేశారనే ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. మేనమాన అండతోనే శ్రీను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విమర్శలు వస్తున్నాయి.
బిట్టు శ్రీనును పోలీసులు నేడు కోర్టులో హాజరు పరుస్తుండగా.. మరోవైపు హైకోర్టు న్యాయవాదులు చలో మంథనికి పిలుపునిచ్చారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. హత్య జరిన నాటి నుంచి పోలీస్ పికెటింగ్ ఉన్నప్పటికీ హైకోర్టు న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో అదనపు బలగాలతో మోహరించారు. మరోవైపు మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.