తెలంగాణ సరిహద్దుల్లో హైఅలర్ట్
దిశ, భద్రాచలం: తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకులు గర్జించాయి. అటవీప్రాంతం రక్తసిక్తమైంది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతదేహాలతోపాటు ఆయుధాలను సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లభ్యమైన ఆయుధాలను బట్టి కీలకమైన నేతలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సరిహద్దు తెలంగాణ ప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు చికిత్స […]
దిశ, భద్రాచలం: తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకులు గర్జించాయి. అటవీప్రాంతం రక్తసిక్తమైంది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మృతదేహాలతోపాటు ఆయుధాలను సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లభ్యమైన ఆయుధాలను బట్టి కీలకమైన నేతలుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సరిహద్దు తెలంగాణ ప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు చికిత్స కోసం తెలంగాణకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే నిఘావర్గాల సూచనతో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పోలీసులు ప్రధాన రహదారులపై కాపుగాచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటు ములుగు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.