పక్షవాతంతో బాధపడుతున్న యంగ్ హీరోయిన్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ శిఖా మల్హోత్రా కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. నర్సింగ్ చేసి యాక్టర్‌గా మారిన శిఖ.. కొవిడ్ టైమ్స్‌లో తన సేవల ద్వారా మానవత్వాన్ని చాటుకుంది. కానీ తనకు ఈ మధ్యే రైట్ సైడ్ పెరాలసిస్‌ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న తాను.. అమ్మ సహకారంతో పూర్తి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. హెల్త్ చాలా స్లోగా మెరుగుపడుతోందని, ఎప్పుడు […]

Update: 2020-12-22 01:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ శిఖా మల్హోత్రా కరోనా కాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. నర్సింగ్ చేసి యాక్టర్‌గా మారిన శిఖ.. కొవిడ్ టైమ్స్‌లో తన సేవల ద్వారా మానవత్వాన్ని చాటుకుంది. కానీ తనకు ఈ మధ్యే రైట్ సైడ్ పెరాలసిస్‌ వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న తాను.. అమ్మ సహకారంతో పూర్తి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. హెల్త్ చాలా స్లోగా మెరుగుపడుతోందని, ఎప్పుడు తనకు తానుగా నడుస్తానో ఖచ్చితంగా తెలియదని చెప్పింది. కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉందన్న శిఖ.. తాను ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేసిన ‘కాంచ్లీ’ సినిమా అల్ట్రా మూవీ పార్లర్‌లో రిలీజ్ కాబోతుందని, అభిమానులందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరింది. దేదిప్య జోషి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కాగా శిఖ తొలిసారి షారుఖ్ ఖాన్ ‘ఫ్యాన్’ మూవీలో కీ రోల్‌ పోషించి మెప్పించింది.

Tags:    

Similar News