‘మహానటి’ పారితోషికం ఎంతో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్: నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి తన నటన స్థాయి ఏంటో అందరికీ తెలిసేలా చేసి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగులో పవర్ స్టార్ సరసన అజ్ఞాతవాసిలో చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన కీర్తి నటనకు మార్కులు బాగానే పడ్డాయి. ప్రస్తుతం కీర్తి వరుస […]

Update: 2020-07-13 10:30 GMT

దిశ, వెబ్ డెస్క్: నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించి తన నటన స్థాయి ఏంటో అందరికీ తెలిసేలా చేసి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగులో పవర్ స్టార్ సరసన అజ్ఞాతవాసిలో చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన కీర్తి నటనకు మార్కులు బాగానే పడ్డాయి. ప్రస్తుతం కీర్తి వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో కొన్ని పూర్తయ్యాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. కానీ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లోనే కీర్తి సురేష్ సినిమాలు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెంగ్విన్ సినిమాను జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసారు. సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మిస్ ఇండియా సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో పాటు తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తుంది. తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా మారిపోయింది. ఇంత బిజీగా ఉన్న కీర్తి ఒక్కో సినిమా కోసం ఎంత తీసుకుంటుందో తెలుసా..?, సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకూ పారితోషికం అందుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయితే కోటిన్నరవరకూ తీసుకుంటుందని, హీరోయిన్ పాత్ర అయితే కోటి తీసుకుంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News