ఆ నష్టానికి హీరో విశాల్ బాధ్యుడు : హైకోర్టు

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీ కూడా జాక్‌పాట్ లాంటిది బాక్సాఫీసు వద్ద ఏ సినిమా హిట్ అవుతుందో, ఏదీ ఫట్ అవుతుందో ఎవరికీ తెలియదు. హిట్ అయితే నిర్మాతలకు పండుగే. అదే ప్లాఫ్ ఐతే వారి కష్టాలు మాటల్లో చెప్పలేనివి. సరిగ్గా ఇలాంటి సీనే కొలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెలుగుచూసింది. హీరో విశాల్ కథానాయకుడుగా తెరకెక్కిన ‘యాక్షన్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాతలు భారీ నష్టాన్ని చవిచూశారు. మొదట్లో ఈ చిత్రాన్ని అతి […]

Update: 2020-10-09 06:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీ కూడా జాక్‌పాట్ లాంటిది బాక్సాఫీసు వద్ద ఏ సినిమా హిట్ అవుతుందో, ఏదీ ఫట్ అవుతుందో ఎవరికీ తెలియదు. హిట్ అయితే నిర్మాతలకు పండుగే. అదే ప్లాఫ్ ఐతే వారి కష్టాలు మాటల్లో చెప్పలేనివి. సరిగ్గా ఇలాంటి సీనే కొలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెలుగుచూసింది.

హీరో విశాల్ కథానాయకుడుగా తెరకెక్కిన ‘యాక్షన్‌’ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాతలు భారీ నష్టాన్ని చవిచూశారు. మొదట్లో ఈ చిత్రాన్ని అతి తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలని నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ భావించింది. కానీ, ‘సినిమా కనీసం రూ.20 కోట్లు కలెక్ట్ చేయని పక్షంలో ఆ నష్టాన్ని నేను భరిస్తా’ అని విశాల్‌ మాట ఇచ్చాడు. ఈ మేరకు రూ.44 కోట్లతో నిర్మాతలు ‘యాక్షన్‌’ సినిమాను తెరకెక్కించారు. విశాల్‌, తమన్నా జంటగా.. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘యాక్షన్‌’. గతేడాది విడుదలై మిశ్రమ స్పందన అందుకొంది.

ఈ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో తమకు వచ్చిన నష్టంపై విశాల్‌తో చర్చించగా.. తాను హీరోగా తెరకెక్కనున్న ‘చక్ర’ మూవీని ట్రైడెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తానని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆ సినిమాను తన సొంత బ్యానర్‌లో విశాల్‌ నిర్మిస్తున్నాడని నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదోపవాదాలు విన్న కోర్టు.. నిర్మాతలకు వచ్చిన నష్టాన్ని హీరో విశాల్ భరించాలని శుక్రవారం తీర్పు ఇచ్చింది. లేకపోతే నష్టాలు భర్తీ చేసేలా రూ.8.29కోట్లకు విశాల్‌ గ్యారెంటీ ఇవ్వాలని న్యాయమూర్తి చెప్పారు.

Tags:    

Similar News