కొవిడ్ కట్టడికి విజయ్ దేవరకొండ టిప్స్

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని నటీనటులందరికీ టీకా ఫ్రీగా వేయిస్తుండగా, కరోనా మొదటి నుంచీ సోనూసుద్ దేశవ్యాప్తంగా ఎక్కడ ఆపద ఉన్నా.. అక్కడ సాయం చేస్తూ వస్తున్నాడు. తాజాగా.. తెలంగాణ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి హీరో […]

Update: 2021-05-07 23:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, క్రీడాకారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని నటీనటులందరికీ టీకా ఫ్రీగా వేయిస్తుండగా, కరోనా మొదటి నుంచీ సోనూసుద్ దేశవ్యాప్తంగా ఎక్కడ ఆపద ఉన్నా.. అక్కడ సాయం చేస్తూ వస్తున్నాడు. తాజాగా.. తెలంగాణ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఎవరికైనా కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందరూ వినియోగించుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక పైన చెప్పిన వాటిలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే.. వెంటనే అక్కడ డాక్టర్లను సంప్రదించి మందులు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.

Tags:    

Similar News