హీరో సల్మాన్ ఖాన్‎కు కోర్టు సమన్లు..!

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‎కు జోధ్‎పూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో రాజస్తాన్‎లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్‎ను దోషిగా నిర్ధారిస్తూ జోధ్‎పూర్ ట్రయల్ ఐదేళ్ల జైలు శిక్ష […]

Update: 2020-09-14 08:36 GMT

దిశ, వెబ్‎డెస్క్: కృష్ణ జింకల వేట కేసులో విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‎కు జోధ్‎పూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో రాజస్తాన్‎లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్‎ను దోషిగా నిర్ధారిస్తూ జోధ్‎పూర్ ట్రయల్ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షపడిన తర్వాత సల్మాన్ జోధ్‎పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‎పై విడుదలయ్యారు.

Tags:    

Similar News