ఒక్క టెస్ట్ కిట్ సేవ్ చేస్తే… ఒక ప్రాణాన్ని సేవ్ చేసినట్లే
తెలంగాణ ప్రభుత్వం మన తెలుగు సినీ ప్రముఖుల ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా హీరో నిఖిల్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మీకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే… భయపడి పోకుండా… సొంత వైద్యం చేయకుండా… మీకు తెలిసిన డాక్టర్ ని సంప్రదించాలన్నారు. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నాయి కదా అని… హైరానా పడిపోకుండా….మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటూ ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. అత్యంత ముఖ్యం అనుకుంటేనే… కరోనా టెస్ట్ […]
తెలంగాణ ప్రభుత్వం మన తెలుగు సినీ ప్రముఖుల ద్వారా కరోనా వైరస్ పట్ల అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా హీరో నిఖిల్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మీకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే… భయపడి పోకుండా… సొంత వైద్యం చేయకుండా… మీకు తెలిసిన డాక్టర్ ని సంప్రదించాలన్నారు. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నాయి కదా అని… హైరానా పడిపోకుండా….మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటూ ఇతరులకు దూరంగా ఉండాలన్నారు. అత్యంత ముఖ్యం అనుకుంటేనే… కరోనా టెస్ట్ చేయించుకోవాలి అన్నారు. ఎందుకంటే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా టెస్ట్ చేసేందుకు కేవలం లక్షా యాభై వేల కిట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి… ఒక టెస్ట్ కిట్ ను సేవ్ చేస్తే … ఒక ప్రాణాన్ని సేవ్ చేసినట్లే.. అని తెలిపారు నిఖిల్.
A Govt of Telangana Message –
A Test Kit is Precious… Please get yourself tested only after observing the symptoms…
#BreakTheChain #HealthyTelangana #Telangana #Corona #COVID19 #GovtTelangana #IIHFW #CoronavirusPandemic pic.twitter.com/b1cCNKTFpk— Nikhil Siddhartha (@actor_Nikhil) March 23, 2020
tags: Nikhil, CoronaVirus, Covid 19