వాహనం ఢీకొని మహిళ మృతి

బొలెరో వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం మధురనగర్ లో శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-20 11:56 GMT

దిశ, కారేపల్లి : బొలెరో వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం మధురనగర్ లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధురానగర్ కు చెందిన గుగులోతు లక్ష్మీ(60) తన భర్త తో కలిసి శుక్రవారం పెన్షన్ డబ్బుల కోసం ఇంటి నుండి బయలుదేరారు. మధురనగర్ సెంటర్లో పత్తి లోడ్ చేస్తున్న టాటా బొలెరో ను బొక్కలతండాకు చెందిన వాంకుడోత్ సాయి వేగంగా వెనుకకు నడపడంతో లక్ష్మీ మీదకు వాహనం టైరు ఎక్కింది. దీంతో లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మి భర్త గుగులోత్ దేశ్యా ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్. రాజారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News