రజనీగా ధనుష్?
దిశ, వెబ్‌డెస్క్: తన స్టైల్, మేనరిజమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం.. ఓ సాధారణ బస్ కండక్టర్‌గా మొదలైందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టిన రజనీ.. అంచెలంచెలుగా ఎదిగి నేడు అభిమానులతో తలైవాగా పిలుపించుకుంటున్నాడు. 69 ఏళ్ల వయసులోనూ యువకుడిలా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు రజనీ. కాగా ప్రస్తుతం వెండితెరపై ఎంతోమంది బయోపిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి రజనీ జీవితంలోనూ సినిమాకు అవసరమయ్యే […]
దిశ, వెబ్‌డెస్క్: తన స్టైల్, మేనరిజమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం.. ఓ సాధారణ బస్ కండక్టర్‌గా మొదలైందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినీరంగంలో అడుగుపెట్టిన రజనీ.. అంచెలంచెలుగా ఎదిగి నేడు అభిమానులతో తలైవాగా పిలుపించుకుంటున్నాడు. 69 ఏళ్ల వయసులోనూ యువకుడిలా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు రజనీ. కాగా ప్రస్తుతం వెండితెరపై ఎంతోమంది బయోపిక్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరి రజనీ జీవితంలోనూ సినిమాకు అవసరమయ్యే అన్ని అంశాలున్నాయి. దీంతో సినీ మేకర్స్ ఇప్పుడు తలైవా జీవితాన్ని తెరమీదకు తెచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. కాగా.. సూపర్ స్టార్ పాత్రను ఆయన అల్లుడు ధనుష్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సామాన్య కండక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీ జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రజనీగా ఆయన అల్లుడు ధనుష్ నటించనున్నారని, లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారడంతో రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మామ బయోపిక్‌ను అల్లుడు చేయడం అదిరింది అంటూ.. మామ మేనరిజమ్స్, స్టైల్‌కు ధనుష్ న్యాయం చేయగలడని కూడా భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను ఇప్పటికే డైరెక్టర్ లింగుస్వామి రెడీ చేశారని, త్వరలోనే అది పట్టాలెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో రజనీ కూడా తళుక్కున మెరిసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా అధికారిక ప్రటకన వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. ప్రస్తుతం తలైవా ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తుండగా, ధనుష్ జగమే తందిరమ్, కర్ణన్, అత్రంగి రే సినిమాలు చేస్తున్నాడు. ఇందులో జగమే తందిరమ్ ఇదివరకే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.