స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది. స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఉక్కు కర్మాగారం కార్మికులతోపాటు ప్రజలు నాయకులు నిరసనలకు దిగుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. […]

Update: 2021-03-10 09:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది. స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఉక్కు కర్మాగారం కార్మికులతోపాటు ప్రజలు నాయకులు నిరసనలకు దిగుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు మద్దతు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుఅంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడలమీద విశాఖ ఉక్కు సాధిస్తాం. అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతోపాటు 9 ఏళ్ళ బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైనది. విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం’’ అని చిరంజీవి ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News