ముంబై పోలీసులకు అక్షయ్ సాయం
కొవిడ్ మహమ్మారి సంక్షోభంలో పెద్ద మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. పీఎం కేర్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిన అక్షయ్.. ముంబై కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు, ముంబై పోలీసులకు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. తాజాగా ముంబై పోలీసులకు ఫిట్‌నెస్ హెల్త్ ట్రాకింగ్ డివైజ్‌లు అందజేశారు. ఈ డివైజ్ ధరిస్తే ఆక్సిజన్, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ రేట్ తెలిసిపోతుందని అంటున్నారు. అక్షయ్ సాయాన్ని అభినందిస్తూ మహారాష్ట్ర […]
కొవిడ్ మహమ్మారి సంక్షోభంలో పెద్ద మనసుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. పీఎం కేర్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చిన అక్షయ్.. ముంబై కార్పొరేషన్‌కు రూ. 3 కోట్లు, ముంబై పోలీసులకు రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చాడు. తాజాగా ముంబై పోలీసులకు ఫిట్‌నెస్ హెల్త్ ట్రాకింగ్ డివైజ్‌లు అందజేశారు. ఈ డివైజ్ ధరిస్తే ఆక్సిజన్, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ రేట్ తెలిసిపోతుందని అంటున్నారు.
అక్షయ్ సాయాన్ని అభినందిస్తూ మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. ‘ముంబై పోలీసుల కన్నా ముందు నాసిక్ పోలీసులకు సైతం అక్షయ్ హెల్త్ ట్రాకిండ్ డివైజ్ అందించారని గుర్తు చేశారు. సైన్యానికి, పోలీసులకు అక్షయ్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుంటారు. కరోనా వారియర్స్‌పై ఆయన చూపిస్తున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆదిత్య పేర్కొన్నారు.