వారసత్వ కట్టడాల పరిరక్షకులకు సన్మానం
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారసత్వ కట్టడాలు, వారసత్వ స్థలాలను పరిరక్షిస్తూ, వాటి ఉనికిని ప్రజల కు తెలియజేస్తున్న 17మందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 39వ ప్రపంచ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో హెరిటేజ్ శాఖ తరుపున వివిధ జిల్లాలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్న వారితో నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను […]
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారసత్వ కట్టడాలు, వారసత్వ స్థలాలను పరిరక్షిస్తూ, వాటి ఉనికిని ప్రజల కు తెలియజేస్తున్న 17మందిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 39వ ప్రపంచ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో హెరిటేజ్ శాఖ తరుపున వివిధ జిల్లాలో వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తున్న వారితో నేడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించేందుకు ప్రజలను భాగస్వామ్యం చేసేలా వాటి విశిష్టతను తెలిసేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.