గరికపాడు చెక్‌పోస్టు వద్ద సాధారణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏపీ సరిహద్దు ప్రాంతం అయిన కృష్ణ జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుంచి వచ్చిన కొందరు వాహనదారులు తిరిగి వెళ్లిపోగా, మిగిలిన 44మందిని నూజివీడు క్వారంటీన్‌కు అధికారులు బస్సులో తరలించారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని 200మంది వాహనదారులను సురక్షితంగా తమ తమ నివాసాలను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వచ్చే వారిని పోలీసులు తిరిగి వెనక్కి పంపుతున్నారు. అత్యవసర […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏపీ సరిహద్దు ప్రాంతం అయిన కృష్ణ జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుంచి వచ్చిన కొందరు వాహనదారులు తిరిగి వెళ్లిపోగా, మిగిలిన 44మందిని నూజివీడు క్వారంటీన్‌కు అధికారులు బస్సులో తరలించారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించని 200మంది వాహనదారులను సురక్షితంగా తమ తమ నివాసాలను పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వచ్చే వారిని పోలీసులు తిరిగి వెనక్కి పంపుతున్నారు. అత్యవసర పనులకు సంబంధించిన మెడికల్ సంబంధిత వారిని తగిన సాక్ష్యాలతో క్లీన్ సర్టిఫికెట్లతో అనుమతి ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడవాళ్లు అక్కడే తమ తమ నివాసాలకు అధికారులు సూచిస్తున్నారు.
Tags: Telangana,Andhra Pradesh, coronavirus, Kuarantin, Vehicle lanes, Check post