రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాజస్థాన్ నుంచి మధ్య భారతావని మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిండంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని, దీని ప్రభావంతో మంగళవారం వరకూ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే […]

Update: 2020-06-20 21:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాజస్థాన్ నుంచి మధ్య భారతావని మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిండంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని, దీని ప్రభావంతో మంగళవారం వరకూ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గడచిన 24 గంటల్లో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

Tags:    

Similar News