హైదరాబాద్‌లో భారీ వర్షం
దిశ, హైదరాబాద్: నగరంలో గురువారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నాం సమయంలో ఓ మోస్తారుగా కురిసినప్పటికీ, మరికొద్ది సేపటికే ఎడతెరిపిచ్చింది. ఇక సాయంత్రం 6.30 గంటలకు మరోసారి వరుణుడు ప్రతాపం చూపించాడు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సైతం డిజిస్టార్ మేనేజ్మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు […]
దిశ, హైదరాబాద్: నగరంలో గురువారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నాం సమయంలో ఓ మోస్తారుగా కురిసినప్పటికీ, మరికొద్ది సేపటికే ఎడతెరిపిచ్చింది. ఇక సాయంత్రం 6.30 గంటలకు మరోసారి వరుణుడు ప్రతాపం చూపించాడు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సైతం డిజిస్టార్ మేనేజ్మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. నగరంలో నీరు నిలిచే ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరాపార్కు, రాంనగర్, బాగ్ లింగంపల్లి, హిమాయత్ నగర్, సచివాలయం, లక్డీకపూల్, నాంపల్లి, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజీ గూడ, అమీర్పేట, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. కాగా, రానున్న మరికొద్ది గంటల్లో భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Tags: rains, Hail rain, GHMC, hyderabad