భారీ వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతూ.. ఎదురు గాలులతో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. కరెంటు వైర్లు తెగి కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రూరల్ మండలం బంగారు గూడా వాగు ఉగ్రరూపం దాల్చింది. దీని కారణంగా ఆయా గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీంపూర్ మండలంలోని గోనధనోరా వాగు […]

Update: 2021-07-08 03:22 GMT

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతూ.. ఎదురు గాలులతో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. కరెంటు వైర్లు తెగి కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రూరల్ మండలం బంగారు గూడా వాగు ఉగ్రరూపం దాల్చింది. దీని కారణంగా ఆయా గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భీంపూర్ మండలంలోని గోనధనోరా వాగు పొంగి పొర్లడంతో ఆర్లీ, అంతర్గాం,గోముత్రి, గుబిడి, రాంపూర్ అటు వైపు వెళ్లే మహారాష్ట్ర అంత రహదారి కి సైతం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తలమడుగు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులకు సమీపంలో ఉన్న పంటచేలలో వరద నీరు వచ్చి చేరడంతో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తంసి మండలంలోని మత్తడివాగు జైనాథ్ మండలంలోని సంతాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా తలపిస్తున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే దిగువ ప్రాంతానికి ప్రాజెక్టుల నీటిని వదిలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జలపాతాల పరవళ్లు…

ఇక భారీ వర్షాల కారణంగా బోథ్ మండలం పోచ్చేర జలపాతం, నేరడి గోండా మండలం‌లోని కుంటాల జలపాతం, బజార్హత్నుర్ మండలం లోని కనాకాయి జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. వీటి అందాలను చూడడానికి ఉమ్మడి రాష్ట్రం లోని పర్యాటకులు వస్తారు. గత రెండు రోజుల నుండి వర్షాలు విస్తారంగా పడడం‌తో జలపాతాలు భారీగా నీరు చేరడం‌తో పర్యాటకులు అధిక మొత్తంలో వచ్చి జలపాతాల అందాలను వీక్షిస్తున్నారు..

Tags:    

Similar News