బెంగళూరులో భారీ వర్షం

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో శనివారం భారీ వర్షం పడింది. బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మైసూరు రోడ్డు, సిల్కు బోర్డు జంక్షన్, హోనూరు రోడ్డు, బీజీ రోడ్డు, బన్నేర్‌ఘట్ట రోడ్డు, నయనదాహళ్లి దారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 12.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కోరమంగళ, […]

Update: 2020-10-23 22:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో శనివారం భారీ వర్షం పడింది. బెంగళూరు నగరంతో పాటు పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మైసూరు రోడ్డు, సిల్కు బోర్డు జంక్షన్, హోనూరు రోడ్డు, బీజీ రోడ్డు, బన్నేర్‌ఘట్ట రోడ్డు, నయనదాహళ్లి దారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 12.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కోరమంగళ, బీటీఎం లే అవుట్, జయనగర్, బసవన్నగుడి, ఆర్ఆర్‌నగర్, హోకేరిహళ్లి, నగరజావి, మల్లేశ్వరం ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి.

Tags:    

Similar News