అలుగు పారింది.. పంట మునిగింది

దిశ, జడ్చర్ల:  జడ్చర్లలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గం తడిసి ముద్దయింది. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానకు తోడుగా ఆదివారం భారీ వర్షం కురవడంతో నియోజకవర్గంలోని మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలాల్లోని పంటలు నీట మునిగాయి. వాగులపై నిర్మించిన చెక్ డ్యాములు నిండి అలుగు పారుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండాయి. కొన్ని గ్రామాల్లో వరద ఉద్ధృతికి కల్వర్టులు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా మిడ్జిల్, […]

Update: 2021-07-18 07:13 GMT

దిశ, జడ్చర్ల: జడ్చర్లలో ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గం తడిసి ముద్దయింది. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానకు తోడుగా ఆదివారం భారీ వర్షం కురవడంతో నియోజకవర్గంలోని మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలాల్లోని పంటలు నీట మునిగాయి. వాగులపై నిర్మించిన చెక్ డ్యాములు నిండి అలుగు పారుతున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండాయి. కొన్ని గ్రామాల్లో వరద ఉద్ధృతికి కల్వర్టులు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ మండలంలోని దుందుభి వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్‌లు నిండుగా పారుతూ సముద్రాన్ని తలపిస్తున్నాయి. కొత్తూరు గ్రామం వద్ద మల్లాపూర్-కొత్తూర్ రహదారిపై వరద నీరు ఉద్ధృత రూపం దాల్చడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News