ఆంధ్రప్రదేశ్‌కు పెను తుఫాను ముప్పు..!

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు పెను తుఫాను ముప్పు ముంచుకొస్తోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది నేడు వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీనికి భారత వాతావరణ శాఖ ‘యాంపిన్’ అని పేరు పెట్టింది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుఫాన్‌గా మారి, తొలుత వాయవ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని అంచనా […]

Update: 2020-05-15 00:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు పెను తుఫాను ముప్పు ముంచుకొస్తోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది నేడు వాయుగుండంగా మారి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీనికి భారత వాతావరణ శాఖ ‘యాంపిన్’ అని పేరు పెట్టింది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయానికి తుఫాన్‌గా మారి, తొలుత వాయవ్య దిశలో, ఆపై ఉత్తర ఈశాన్య దిశలో పయనించి పెను తుఫాన్‌గా రూపాంతరం చెందనుందని అంచనా వేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు కురుస్తున్నాయి. వీటికి యాంపిన్ తోడైతే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. 17వ తేదీన తీరం వెంబడి 80 కిలోమీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, 18న గాలుల తీవ్రత అధికమవుతుందని హెచ్చరించారు. కాగా, నేడు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News