పెళ్లి మండపంలో మత్తు మందిచ్చి..
దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు పెళ్లి తంతు నడుస్తుండగా.. మరోవైపు ఫంక్షన్ హాల్ లోనే భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. నిండు పెళ్లి పందిరిలో నిలువెళ్లా దోచుకెళ్లారు. డిచ్‌పల్లిలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్రకలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఫంక్షన్ హాల్ లో బుధవారం ఓ వివాహం జరిగింది. వివాహానికి బంధువులు తెచ్చిన బంగారం, గిఫ్టులు కూర్చున మహిళకు మత్తు ఇంజిక్షన్ ఆమె వద్ద […]
దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు పెళ్లి తంతు నడుస్తుండగా.. మరోవైపు ఫంక్షన్ హాల్ లోనే భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు. నిండు పెళ్లి పందిరిలో నిలువెళ్లా దోచుకెళ్లారు. డిచ్‌పల్లిలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్రకలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
డిచ్‌పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఫంక్షన్ హాల్ లో బుధవారం ఓ వివాహం జరిగింది. వివాహానికి బంధువులు తెచ్చిన బంగారం, గిఫ్టులు కూర్చున మహిళకు మత్తు ఇంజిక్షన్ ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. మత్తునించి తేరుకున్న మహిళా.. విషయాన్ని బంధువులకు చెప్పండంతో ఫంక్షన్ హాల్ మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు యువకులు బ్యాగ్ ఎత్తుకెళ్లినట్టు రికార్డయింది. బ్యాగ్‌లో 35 తులాల బంగారు ఆభరాణాలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.