ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారిగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని పొడిగా మార్చి జీన్స్ పాయింట్ నడుము భాగంలో అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించారు కేటుగాళ్లు. వారిని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద తనిఖీలు జరిపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారి కదిలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో వారి పాయింట్ నడుము భాగంలో పొడిగా […]
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారిగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని పొడిగా మార్చి జీన్స్ పాయింట్ నడుము భాగంలో అమర్చుకుని తరలించేందుకు ప్రయత్నించారు కేటుగాళ్లు. వారిని పసిగట్టిన కస్టమ్స్ అధికారులు వారి వద్ద తనిఖీలు జరిపి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారి కదిలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో వారి పాయింట్ నడుము భాగంలో పొడిగా ఉన్న బంగారాన్ని గుర్తించారు అధికారులు. నిందితుల వద్ద 1.4 కిలోల బంగారాన్న స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విలుల సుమారు రూ. 69.6 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులపై అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.