భారీ వరదలు.. అస్సాం అతలాకుతలం
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసిన ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే 103 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ప్రముఖ కంజిరంగా నేషనల్ పార్క్‌లో వరద ఉధృతికి వందలాది వన్యప్రాణులు మృత్యువాద పడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ముంపు […]
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసిన ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటికే 103 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ప్రముఖ కంజిరంగా నేషనల్ పార్క్‌లో వరద ఉధృతికి వందలాది వన్యప్రాణులు మృత్యువాద పడ్డాయి.
దీంతో రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 5305 గ్రామల్లో వేల సంఖ్యల్లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 615 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. దీంతో దాదాసే 1.5 లక్షల మంది వరద బాధితులు శిబిరాల్లోనే ఉంటున్నారు.