విశాఖలో భారీగా గంజాయి పట్టివేత
దిశ, విశాఖపట్నం: విశాఖపట్టణం జిల్లాలో కోటి రూపాయాల విలువ చేసే వెయ్యి కేజీల గంజాయిని డుంబ్రింగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డుంబ్రింగూడ సీఐ పైడయ్య మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఏజెన్సీ అరకు లోయలో సర్కిల్ పరిదిలో ఇటీవల కాలంలో భారీగా గంజాయి అక్రమ రవాణా అవుతుందనే ఫిర్యాదుల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వాహనాన్ని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామ సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం […]
దిశ, విశాఖపట్నం: విశాఖపట్టణం జిల్లాలో కోటి రూపాయాల విలువ చేసే వెయ్యి కేజీల గంజాయిని డుంబ్రింగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డుంబ్రింగూడ సీఐ పైడయ్య మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఏజెన్సీ అరకు లోయలో సర్కిల్ పరిదిలో ఇటీవల కాలంలో భారీగా గంజాయి అక్రమ రవాణా అవుతుందనే ఫిర్యాదుల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వాహనాన్ని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామ సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం జీపులో తనిఖీలు నిర్వహించి, వెయ్యి కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా జీపులో ప్రయాణిస్తున్న 12 మందిని అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు వెల్లడించారు.