వైజాగ్‌కు టూ యూపీ.. భారీగా గంజాయి పట్టివేత
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలంగాణ రాష్ట్ర బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట ఎస్సై రామ్మూర్తి విస్తృత తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ రాహుల్, మహమ్మద్ సుల్తాన్‌లు ఏపీలోని […]
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలంగాణ రాష్ట్ర బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట ఎస్సై రామ్మూర్తి విస్తృత తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ రాహుల్, మహమ్మద్ సుల్తాన్‌లు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన కంప రామిరెడ్డితో కలిసి విశాఖపట్నంలోని చింతపల్లిలో 6.50 క్వింటాల గంజాయిని కొనుక్కొని ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న 130 గంజాయి ప్యాకెట్లు దాదాపు 686 కేజీలు ఉన్నాయని, వాటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండొచ్చని వెల్లడించారు.