వేడెక్కిన 'మా' రాజకీయం.. ఆ హీరో, విలన్ మధ్యనే రసవత్తర పోరు

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే రాజకీయం వేడెక్కుతోంది. ఇక ఈ ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే మా అధ్యక్ష ఎన్నికలు గత ఏడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో  మరోసారి మా ఎలక్షన్స్ తెరపైకి వచ్చాయి.   ఈసారి ఈ ఎన్నికలు ఇంత హీట్ అవ్వడానికి కారణం.. నటుడు […]

Update: 2021-06-21 05:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే రాజకీయం వేడెక్కుతోంది. ఇక ఈ ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే మా అధ్యక్ష ఎన్నికలు గత ఏడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో మరోసారి మా ఎలక్షన్స్ తెరపైకి వచ్చాయి. ఈసారి ఈ ఎన్నికలు ఇంత హీట్ అవ్వడానికి కారణం.. నటుడు ప్రకాష్ రాజ్. ఇటీవల ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూ లో తానూ ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్లు తెలిపాడు. తనకు తానుగా ప్రకాష్ రాజ్ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ప్యానల్ లో ఎవరు ఉంటారు? అసలు ఆయనకు పోటీగా ఎవరు నిలుస్తారు..? అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అనుకొంటే మరో పక్క ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు వారబ్బాయి మంచి విష్ణు బరిలోకి దిగుతున్నాడు. ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించకముందే విష్ణు ప్రచారాన్ని ముమ్మురం చేశాడు. ఇక కొడుకును గెలిపించడానికి మోహన్ బాబు సైతం పాములు కదుపుతున్నాడు. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ ఈరోజు మంచు విష్ణు, మోహన్ బాబు సూపర్ స్టార్ కృష్ణను కలవడం కలకలం రేపుతోంది. కృష్ణుఁ కలిసి తమ మద్దతును విష్ణు కి తెలపాలని మోహన్ బాబు కోరినట్లు తెలుస్తోంది.

ఫిల్మ్ నగర లోని ఈక్వేషన్స్ చూస్తే. మంచు విష్ణు ముందంజలో ఉండటమే కాదు. విజయపథాన కూడా సాగే ఆస్కారం కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబు ల మధ్య ఉన్న వైరం ఇప్పుడు కనిపించడం లేదు. వీరిద్దరూ ఈ మధ్య సఖ్యతగానే ఉండడంతో చిరు మద్దతు కూడా మంచువారబ్బాయికే ఉంటుందని టాక్. ఇక ప్రకాష్ రాజ్ కి సైతం చిరు మంచి సన్నిహితుడు. చిరు మద్దతు మీకు ఉంటుందా..? అంటే ‘అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని ఈ ఎన్నిక కోసం వినియోగించుకోను’ అని ప్రకాష్ రాజ్ అనడం గమనార్హం. మరి ఎన్నికల తేదీ ప్రకటించకముందే పోటాపోటీగా సాగుతున్న ఈ ఎలక్షన్స్ క్యాంపైన్ ఎటు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Tags:    

Similar News