బైక్‌పై వెళ్తుండగా యువకుడికి గుండెపోటు.. బ్రేకు వేసేలోపే..!

దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన పండ్ల రాజు (26) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యలోనే నొప్పి తీవ్రత పెరిగి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ […]

Update: 2021-11-19 10:44 GMT

దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన రాజు అనే ఓ యువకుడు వాహనంపై వెళుతుండగానే గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని పాత బజార్‌కు చెందిన పండ్ల రాజు (26) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తనకు గుండెల్లో నొప్పిగా ఉందని మిత్రులతో చెప్పగా.. ఓ మిత్రుడు తన స్కూటీపై రాజును తీసుకొని ఆసుపత్రికి బయలుదేరాడు. కాగా మార్గమధ్యలోనే నొప్పి తీవ్రత పెరిగి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోగా.. రాజు ఓ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని మిత్రులు తెలిపారు. ఇటువంటి సమయంలో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరం.

Tags:    

Similar News