కాలేయాన్ని కాపాడుకుందాం: ఇవాళ (ఏప్రిల్ 19) వరల్డ్ లివర్ డే

మానవ శరీరంలో గుండె తర్వాత రెండో ముఖ్యమైన అవయవంగా కాలేయం అని డాక్టర్లు చెబుతున్నారు.

Update: 2023-04-18 18:45 GMT

దిశ, వెబ్ డెస్క్: మానవ శరీరంలో గుండె తర్వాత రెండో ముఖ్యమైన అవయవంగా కాలేయం అని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేయడం, రోగనిరోధక శక్తిని ఇవ్వడం, వ్యర్థపదార్థాలను ఫిల్టర్ చేయడం, విటమిన్స్, మినరల్స్, గ్లూకోజ్ వంటి వాటిని నిల్వ చేయడం లాంటి అనేక పనులను కాలేయం చేస్తుంటుంది. దాదాపు 60 నుంచి 70 శాతం వరకు పాడైన కాలేయం తిరిగి మామూలు స్తాయికి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాలేయం యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పడానికే ప్రతి ఏటా ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే (ప్రపంచ కాలేయ దివనోత్సవం)ను జరుపుతారు. కాలేయ సంబంధిత వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏడాదికి దాదాపు 20 లక్షల మంది కాలేయ సమస్యలతో చనిపోతున్నారు. ఈ రేట్ ప్రతి ఏడాదికి 35 శాతం పెరుగుతూ పోతోంది.


2023 వరల్డ్ లివర్ డే థీమ్

‘‘అప్రమత్తంగా ఉండండి.. రెగ్యులర్ లివర్ చెక్-అప్ చేసుకోండి... ఫ్యాటీ లివర్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది’’ అనేది ఈ ఏడాది వరల్డ్ లివర్ డే థీమ్. ఒబేసిటీ, డయాబెటిస్, అల్కాహాల్ తీసుకునే వారే కాకుండా ప్రతి ఒక్కరు పైన పేర్కొన్న థీమ్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే దేశంలో జరిపిన ఓ సర్వేలో అల్కాహాల్ ముట్టుకోని వాళ్లు లేదా కొంచెం అల్కాహాల్ మాత్రమే తాగేవాళ్లలో 75 శాతం మంది లివర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడ్డారని తేలింది.


వరల్డ్ లివర్ డే ప్రాముఖ్యత

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏటా 20 లక్షల మంది కాలేయ సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని ఓ సర్వేలో తేలింది. అందులో 50 శాతం మంది సిర్రోసిస్ అనే కాలేయ వ్యాధితో చనిపోగా.. మిగతా మంది హైపటైటిస్, హైపటోసెల్యూలర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. మొత్తానికి ఈ రెండు వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 శాతం చనిపోతుండగా.. భారత దేశంలో ఏటా చనిపోతున్న వారి లిస్టులో లివర్ వ్యాధుల వల్ల చనిపోయే వాళ్ల సంఖ్య 11 శాతం ఉంది. ఇందులో 8 నుంచి 10 శాతం మంది లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ఒబేసిటీతో, 40 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీళ్లలో చాలా మంది లివర్ హపటో సెల్యూలర్ కార్సినోమాతో బాధపడుతున్నారు. ఏటా 35 శాతం చొప్పున ఈ వ్యాధుల పెరుగుదల కనిపిస్తోంది.

హైపటైటిస్ ఏ, హైపటైటిస్ బీ, హైపటైటిస్ సీ, సిర్రోసిస్ అనేవి కాలేయానికి సంబంధించిన ప్రధాన వ్యాధులు. వ్యాధి తీవ్రత, సంబంధిత ప్రమాద కారకాలు, నివారణకు సంబంధించి అవగాహన లేకపోవడమే ఈ సంఖ్య పెరుగుదలకు కారణం. ఈ రోజున హెల్త్‌కేర్ పాలసీ రూపకర్తలు, ప్రైవేట్ హెపటాలజిస్టులు/హెపాటో-ఆంకో సర్జన్‌లు కాలేయ వ్యాధి ప్రమాదం, దాని నిర్యూలన గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులో మార్పు తీసుకురావడం వల్ల లివర్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.


కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

మానవ శరీరంలో రెండో అతిముఖ్యమైన అవయవం కాలేయం. వ్యర్థ పదార్థాల ఫిల్టర్ చేయడంలో కాలేయం పాత్ర అమోఘం. అందుకే ప్రతి ఒక్కరూ తమ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ కిందివి చేయాలి.

1. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

2. స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి ఎక్సర్ సైజ్, యోగా లాంటివి చేయాలి.

3. మద్యపానం, ధూమపానం నుంచి దూరంగా ఉండాలి.

4.సొంత వైద్యాన్ని మానుకోవాలి. డాక్టర్ల సలహా తీసుకోవాలి.

5. సమయానికి వ్యాక్సిన్ తీసుకోవాలి.

6. ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి.

7. ఉపయోగించిన సిరంజీలు వాడొద్దు.

8. అసురక్షిత లైంగిక కలయికకు దూరంగా ఉండాలి.

Tags:    

Similar News