ఉదయం ఖాళీకడుపుతో తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే?

చాలా మంది తమకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఉదయం లేవగానే మంచి ఫుడ్ తీసుకోవడం వలన ఆరోగ్యకరంగా ఉంటాం. కానీ కొందరు ఉదయం పూట తినకూడని

Update: 2023-04-26 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది తమకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఉదయం లేవగానే మంచి ఫుడ్ తీసుకోవడం వలన ఆరోగ్యకరంగా ఉంటాం. కానీ కొందరు ఉదయం పూట తినకూడని ఆహార పదార్థాలు తీసుకొని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. కాగా, ఉదయం వేళ ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

  • పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోకూడని వాటిల్లో కాఫీ, టీ తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందంట, అంతే కాకుండా ఎసీడీటీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కనుక ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ, కాఫీ లు తాగే అలవాటు ఉన్న వారు ఆ అలవాటును సాధ్యమైనంత త్వరగా మానుకోవాలి.

  • ఉదయం పూట ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్, సోడా వంటి చల్లటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో అల్సర్స్, వాంతులు అవ్వడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

  • ఖాళీ కడుపుతో టమాటాలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్ల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

  • అలాగే ఉదయం పూట ఖాళీ కడుపుతో కారంగా ఉండే పదార్థాలను, మసాలా దట్టించి వండిన పదార్థాలను , చిప్స్ లాంటివి తీసుకోకూడదు. 

Also Read...

వడదెబ్బ అంటే ఏమిటి..? దాని నివారణ చర్యలు..! 

Tags:    

Similar News