శిశువుకు మొదటి స్నానం చేయిస్తున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త!

అమ్మతనం అనేది గొప్పవరం. ఓ పసిపాప ఈలోకంలోకి రాగానే తనను చూసి ఆ తల్లి మురిసిపోతుంది. క్యూట్ క్యూట్‌గా ఉన్న తన బంగారు తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది, తనను బాగా చూసుకోవాలని ఆశ పడుతుంటుంది.

Update: 2024-05-14 09:36 GMT

దిశ, ఫీచర్స్ : అమ్మతనం అనేది గొప్పవరం. ఓ పసిపాప ఈలోకంలోకి రాగానే తనను చూసి ఆ తల్లి మురిసిపోతుంది. క్యూట్ క్యూట్‌గా ఉన్న తన బంగారు తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది, తనను బాగా చూసుకోవాలని ఆశ పడుతుంటుంది. ఇక పుట్టిన క్షణం నుంచి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ముఖ్యంగా పసికందుగా ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

అయితే బిడ్డ పుట్టిన తర్వాత తనకు స్నానం చేయించడం అనేది కామన్. ఇక పుట్టిన బేబీకి కొందరు మూడు లేదా నాలుగు రోజులకు స్నానం చేయిస్తే, కొందరు వైద్యుడి సలహాతో వారం లేదా రెండు వారాలకు బొడ్డు తాడు ఊడిపోయాక, స్నానం చేయిస్తారు. ఎలా చేసినా..బేబీ మొదటి స్నానం అనేది కాస్త రిస్క్‌తో కూడిన పనినే అనే చెప్పవచ్చు. అందువలన బిడ్డకు మొదటి స్నానం చేయిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుుడు చూద్దాం.

గోరు వెచ్చటి నీరు

పసికందుకు మొదటి స్నానం చేయించడానికి గోరు వెచ్చటి నీటిని ఉపయోగించాలి. కొంత మంది ఎక్కువ వేడి లేదా, చల్లగా ఉన్న నీరు పోస్తుంటారు. కానీ అలా చేయకుండా గోరు వెచ్చటి నీటితో కొన్ని కొన్ని వాటర్ పోస్తూ స్నానం చేయించాలి. ఎందుకంటే బిడ్డ శరీరం అప్పుడే ఎక్కువ వేడిని లేదా చల్లటి నీటిని తట్టుకోలేదు.

ముక్కు, కళ్లు జాగ్రత్త

స్నానం చేయించే క్రమంలో వాటర్ అనేవి బేబీ ముక్కు లేదా కళ్లు, నోటిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి.

తలకు, మెడకు సపోర్ట్ అవసరం

పసి కందు చర్మం కానీ, తన అవయవాలు కానీ చాలా సున్నింతగాను, సపోర్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందువలన బేబీస్‌కు స్నానం చేయించే ముందు, తల,మెడకు సపోర్ట ఇవ్వాలి. అలాగే తల,మెడ భాగం కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.

సోప్స్ విషయంలో బీ కేర్ ఫుల్

చిన్న పిల్లలకు స్నానం చేయించే రోజు సోప్ పెడుతుంటారు. అయిదే సోప్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కవ కళ్లలో మంట ఇచ్చేవంటివి, కెమికల్స్ ఉండేవి కాకుండా నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి.

పీస్ ఫుల్ వాతావరణం

శిశివుకు మొదటిస్నానం చేయిస్తున్నప్పుడు వెచ్చటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అంతే కాకుండా అల్లరిగా కాకుండా పీస్‌పుల్‌గా ప్లేస్‌లో స్నానం చేయించాలి. స్నానం తర్వాత కూడా వెంటనే తూడ్చి, తన గది వెచ్చగా ఉండేలా చూసకొని, వెచ్చగా ఉండే వస్త్రాల్లో వేసి పడుకోబెట్టాలి

సున్నితంగా తుడవడం

స్నానం తర్వాత బేబీని మెత్తటి గుడ్డతో తుడవాలి. ముృధువైన వస్త్రాలు అస్సలే వాడకూడదు. ముందుగా ముఖం, చెవులు, ముఖం, డైపర్ వేసే ప్రాంతంలో మంచిగా తూడ్చి, పౌడర్ వేయాలి.

చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం

స్నానం చేసిన తర్వాత, చర్మం మడతలు, డైపర్ ప్రాంతాలను మృదువైన టవల్ తో తుడవండి. కావాలనుకుంటే, చర్మాన్ని తేమగా మార్చడానికి తేలికపాటి, హైపోఅలెర్జెనిక్ బేబీ లోషన్ లేదా నూనెను వర్తించండి. శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది.


Similar News