సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తే అల్లం నమలడం మంచిదా? చెడ్డదా?

ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం తీసుకుంటున్నా ఆహారం, జీవన శైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. అందువలన వైద్యులు ఆరోగ్యం

Update: 2024-06-02 09:43 GMT

దిశ ఫీచర్స్ : ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం తీసుకుంటున్నా ఆహారం, జీవన శైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. అందువలన వైద్యులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నారు.

అయితే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఎటాక్‌తో మరణాలు పెరుగుతున్న క్రమంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మీకు ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వస్తుంది జాగ్రత్త, సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తే ఈ టిప్ ట్రై చేయండి. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే, సీపీఆర్ చేసే విధానం ఇలా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు అల్లం నమిలితే సమస్య నుంచి బయటపడ వచ్చునంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై వైద్యులు స్పందించి క్లారిటీ ఇస్తున్నారు. సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తే అల్లం నమలడం మంచిదని ఎక్కడా లేదని, దీనికి సైంటిఫిక్ ఫ్రూఫ్ లేదు, ఇది గుండెపోటును తగ్గిస్తుందని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు లేవు అందువల్ల ఇలాంటి వాటిని నమ్మకూడదు అని డాక్టర్ చెప్పుకొచ్చారు. ఒక వేల మీకు సడెన్‌గా గుండెపోటు వచ్చినట్లు అనిపిస్తే ఆస్పిరిన్ ట్యాబ్ లెట్ వాడాలని ఆయన సూచించారు. అలాగే దయ చేసి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మకూడదని, అల్లం నమిలితే గుండెపోటు రాదు అనేది అవాస్తవం, దీనిలో ఎలాంటి నిజం లేదు అని ఆయన కొట్టిపారేశారు.


Similar News